విజయానికి గుర్తుగా 'వైగై ఎక్స్‌ప్రెస్' తపాలాబిళ్ల విడుదల
- March 27, 2017నటుడు, నిర్మాత ఆర్కే స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన 'వైగై ఎక్స్‌ప్రెస్' గత శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు షాజి కైలాస్ తెరకెక్కించిన ఈ చిత్రానికి యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పంపిణీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ఆర్కే ఇప్పుడు ప్రచారాన్నీ కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. 'వైగై ఎక్స్‌ప్రెస్' విజయానికి గుర్తుగా ఈ సినిమా పోస్టర్‌తో ఒక తపాలాబిళ్లను విడుదల చేశారు. తద్వారా ఇప్పటివరకు ఏ చిత్రానికీ దక్కని ఘనతను 'వైగై ఎక్స్‌ప్రెస్' దక్కించుకుంది. తపాలాబిళ్లను చెన్నైలో శనివారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే, హీరోయిన్ నీతూ చంద్ర, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్