రియాద్ లో దోపిడీకి పాల్పడ్డ సాయుధులైన దొంగలు..చోరీసొమ్ముతో పరారీ
- March 27, 2017
నగదు రవాణా చేసే ఒక కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులపై గుర్తు తెలియని సాయుధులైన దొంగలు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం డబ్బు చేజిక్కించుకొని దొంగ సొత్తుతో పరారయ్యారు. దీనిపై సమాచారం అందించిన ప్రతినిధి రియాద్ ప్రావిన్స్ పోలీస్ కల్నల్ ఫరజ్ అల్ మైమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివారం బులెట్ గాయాలు పాలైన ఆ ఉద్యోగులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స జరుపుతున్నట్లు తెలిపారు.ఈ సంఘటనకు సంబంధించి భద్రతా అధికారులు వారి పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని కల్నల్ అల్ మైమన్ ధ్రువీకరించారు. పోలీసులు సాయుధ దొంగలను అదుపులోనికి తీసుకొనేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉంటారని ఆయన ఉద్ఘాటించారు. ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం రాజధాని రియాద్ ఉత్తర భాగంలోని అల్ రెడ్జిల్లా ఆదివారం ముగ్గురి మధ్యాహ్న సమయంలో (దుహ్ర్ ) ఆయుధాల ట్రక్కులో నగదు తరలించుతున్నారనే సమాచారం తెల్సుకొని ముగ్గురు దుండగులు ట్రక్కు మార్గాన్ని అడ్డుకొని ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలిపారు.నగదు తరలిస్తున్న కంపెనీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న ట్రక్కుని లక్ష్యం చేసుకొని విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపేరు. ఆ తర్వాత వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బుని దోచుకున్నారు. వారు దొంగిలించిన సొత్తు సుమారు 2 మిలియన్ల సౌదీ రియాళ్ల వరకు ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందిపై పట్ట పగలు కాల్పులు జరిపిన నేపథ్యంలో తీవ్రంగా గాయపడ్డారు. తూటాల కాల్పులలో గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







