సిగరెట్ వ్యర్థాలను తొలగించేందుకు కొత్త ప్రయోగం
- May 25, 2017దుబాయ్ మునిసిపాలిటీ, రోడ్లపై కనిపించే వాడేసిన సిగరెట్ వ్యర్థాలను తొలగించేందుకుగాను అధునాతన పరికరాల్ని వినియోగించనుంది. రోడ్లు, మార్కెట్ ప్లేస్‌లలో కనిపించే ఈ తరహా వేస్టేజ్‌లను సంప్రదాయ పద్ధతుల్లో తొలగించడం ఇప్పటిదాకా జరుగుతూ వస్తోంది. దానికి భిన్నంగా కొత్త పరికరంతో ఈ వేస్టేజీని తొలగిస్తారు. 120 లీటర్ల కెపాసిటీ గల ఈ పరికరం, ఇసుకని వేరుగా, సిగరెట్ వ్యర్థాల్ని వేరుగా సేకరిస్తుంది. ఎక్కడంటే అక్కడ వినియోగించేందుకు వీలుగా ఉంటుంది ఈ పరికరం. అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో దుబాయ్ మునిసిపాలిటీ ఎప్పుడూ ముందుంటుందని, క్లీన్‌గా ఉంచేందుకోసం ఈ తరహా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని దుబాయ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్ మజీద్ సిఫాయి చెప్పారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు