అవియల్
- October 22, 2017కావాల్సిన పదార్థాలు: క్యారెట్ - 200 గ్రాములు, బీన్స్ - 250 గ్రాములు, తెల్ల గుమ్మడికాయ - 250 గ్రాములు, అరటికాయలు - రెండు, పచ్చిమిరపకాయలు - పది, పొట్లకాయ - 250 గ్రాములు, మునగకాయలు - మూడు, అల్లం - కొద్దిగా, కరివేపాకు - రెండు రెబ్బలు, కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, పెరుగు - 500 గ్రాములు, జీలకర్ర - పది గ్రాములు, కొబ్బరినూనె -100 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారీ విధానం: కూరగాయలంటినీ వేలు సైజులో కోసుకోవాలి. వీటికి కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. పదినిమిషాల తర్వాత వాటిని ఉడికించి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము, నాలుగు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. గిన్నెలో కొబ్బరి నూనె వేసి వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక, కొబ్బరి ముద్ద వేసి, అదీ వేగాక కూరగాయ ముక్కలు వేయాలి. చివర్లో కొద్దిగా పెరుగు వేసి ఉడికించుకోవాలి. దీన్నే అవియల్ అంటారు. దీనిని అన్నంలో ఇష్టంగా తింటారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!