రైలు ఏసీ-1, ఏసీ -2 టికెట్ కన్‌ఫమ్ కాకపోతే విమానంలో వెళ్లే అవకాశం...

- October 23, 2017 , by Maagulf
రైలు ఏసీ-1, ఏసీ -2 టికెట్ కన్‌ఫమ్ కాకపోతే విమానంలో వెళ్లే అవకాశం...

రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ-1, ఏసీ -2 వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్‌ఫమ్ కాకపోతే ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణికులను విమానంలో పంపించాలని యోచిస్తున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహాని వెల్లడించారు. రాజధాని రైళ్లలో ప్రయాణికుల రద్దీ వల్ల ఏసీ -2 టికెట్లు కన్ ఫమ్ కావడం లేదని అలాంటి వారిని విమానాల్లో పంపించి విమానాల్లో ఆక్యుపెన్సీని పెంచేలా చూస్తామని అశ్వనీ పేర్కొన్నారు. వెయిటింగ్ లిస్టులో ఉండి కన్ ఫమ్ కాని రాజధాని ఏసీ టికెట్ ఉన్న ప్రయాణికుల వివరాలు ఎయిర్ ఇండియాకు పంపిస్తామని వారు ఎలాంటి అధిక చార్జీలు వసూలు చేయకుండానే వారిని వారి గమ్యస్థానాల్లో దింపేలా చూస్తామన్నారు. ఈ ప్రతిపాదనను ఎయిర్ ఇండియాకు పంపించామని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు. రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వనీ చేసిన ప్రతిపాదనపై తాను ఇప్పుడే మాట్లాడనని, ఎందుకంటే రైల్వేకు, విమాన చార్జీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఎయిర్ ఇండియా ఛైర్మన్ రాజీవ్ బన్సాల్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com