దుబాయ్ లో ఓ హోటల్ నుండి 1.2 లక్షల ధిర్హాం ఫెరారీ కారు దొంగతనం : నల్గురు పట్టివేత

- October 23, 2017 , by Maagulf
దుబాయ్ లో  ఓ హోటల్ నుండి 1.2 లక్షల ధిర్హాం ఫెరారీ కారు దొంగతనం : నల్గురు పట్టివేత

దుబాయ్: పామ్ జ్యూమరాలో ఒక హోటల్ నుంచి ఫెరారీ కారు దొంగిలించబడిన 24 గంటలు గడవక ముందే  సుమారు 1.2 మిలియన్ డాలర్ల విలువైన కారుని పోలీసులు చాకచక్యంగా వెతికి స్వాధీనం చేసుకొన్నట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారాల అధికారి మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సురి మాట్లాడుతూ ఈ నెల అక్టోబర్ 13 వ తేదీన హోటల్ పార్కింగ్ చేయబడిన  ఫెరారీ 458 నెంబర్ గల కారు యజమాని నుండి పోలీసులు ఒక ఫోన్ కాల్ వచ్చింది. " కారు యజమాని యూరోపియన్ కాగా ఆయన హోటల్ భూగర్భ పార్కింగ్ లో తన కారుని ఉంచెనని అది దొంగిలించబడిందని పోలీసులకు పిర్యాదు చేశారు . మేము ఒక అన్వేషణ వేట ప్రారంభించి, నల్గురు సభ్యులు గల ఒక దొంగల ముఠాని అరెస్టు చేసి, ఆకుపచ్చ ఫెరారీను 24 గంటల కంటే తక్కువ సమయంలో స్వాధీనం చేసుకున్నామని మాజ్-జెన్ అల్ మన్సోరి " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " తెలిపారు ఈ దొంగతనంలో ముగ్గురు  యూరోపియన్లు మరియు ఒక ఆఫ్రికన్ తో  సహా నలుగురు దొంగలు ఈ కారును దొంగిలించారు  పొరుగున ఉన్న ఎమిరేట్లో ఒక గ్యారేజీకి వాహనం తీసుకెళ్లి  ఫెరారీ కారు విడి భాగాలు ఊడదీసి    ఇంకొక దేశానికి రవాణా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. "ఈ కారు ఇద్దరు  యూరోపియన్లచే దొంగిలించబడింది, ఆ తరువాత వారు మధ్యవాది అయిన మూడవ యూరోపియన్ వ్యక్తికి అప్పగించారు. ఆ కారుని 55,000 డాలర్లకు (200,000 ధిర్హాంలు) మరో  ఆఫ్రికన్ అనుమానితుడికి  విక్రయించాడు. కారు దెయ్యం 1.21 మిలియన్ల విలువైనది, ఆఫ్రికన్ మనిషి  ఆ వాహనాన్ని ఏ భాగానికి ఆ భాగం విడదీయడానికి ఒక గ్యారేజీకి తీసుకువెళ్ళాడని తాము అక్కడకు వెళ్లి అందరిని పట్టుకున్నట్లు మేజ్-జనన్ అల్ మన్సురి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com