నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- April 25, 2024
అమరావతి: వైసీపీ అధినేత, సీఎం జగన్ పులివెందుల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం మహానేత వైయస్‌ఆర్, ఆయన బిడ్డగా వైయస్‌ఆర్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మీ బిడ్డ జగన్ ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ. మంచి చేయడం మన కల్చర్.. మంచి మనసు మన కల్చర్.. మాట తప్పకపోవడం మన కల్చర్.. బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్’’ అంటూ జగన్ భారీ డైలాగ్స్ తో కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాగే టీడిపి , బిజెపి , జనసేన , కాంగ్రెస్ పార్టీల అధినేతల ఫై విమర్శలు కురిపించారు. ఇక ఎంపీ అవినాష్ రెడ్డి చాల అమాయకుడు , పిల్లవాడు..ఆయన రాజకీయ జీవితం నాశనం చేయాలనీ చెల్లెమ్మలు కుట్ర చేస్తున్నారంటూ పరోక్షంగా షర్మిల , సునీతల ఫై జగన్ ఆరోపణలు చేసాడు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







