కార్న్‌ఫ్లోర్ స్వీట్
- November 17, 2017కావలసిన పదార్థాలు: కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు, పాలు - 3 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీడిపప్పు - 10, పంచదార - ఒకటిన్నర కప్పు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో పంచదార, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు చుట్టకుండా పాలు కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టాలి. పాన్‌లో ఈ మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడేదాక గరిటెతో తిప్పుతుండాలి. తర్వాత ప్లేట్లో నెయ్యి వేసి సమానంగా సర్దాలి (పదినిమిషాలు ఉంచితే చల్లబడుతుంది). ఈ లోపుగా జీడిపప్పుని నేతిలో వేగించి (పూర్తి మెత్తగా కాకుండా) పొడి చేసుకొని మిశ్రమంపై చల్లాలి. తర్వాత మీకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు