క్యాప్సికం లో ఔషధ గుణాలు పుష్కలం
- December 06, 2017బెంగుళూరు మిర్చిగా పిలుచుకునే క్యాప్సికం ప్రస్తుతం మార్కెట్లో ఎక్కు గా లభిస్తుంది. రకరకాల రంగుల్లో సైతం లభ్యమవుతుంది. కాని రెగ్యులర్‌గా దొరికేవి మాత్రం ఆకు పచ్చవే. ఒక రోజుకు కావాల్సిన సి విటమిన్ ఒక్క క్యాప్సికంలోనే దొరుకుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలున్న క్యాప్సికం గురించి తెలుసుకుందాం... క్యాప్సికంలో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంన్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, ఎంజైమ్స్ శరీరానికి ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. బీటా కెరోటిన్ పసుపు పచ్చ క్యాప్సికంలో అధికంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు క్యాప్సికంలో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి లు టమాటాలో కన్నా క్యాప్సికంలోనే అధికంగా ఉంటాయి. కొవ్వుక్యాలరీలు తక్కువగా ఉండే క్యాప్సికం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉంచడానికి క్యాప్సికం దోహద పడుతుంది. ఆరోగ్యానికే కాకుండా సౌందర్యానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాప్సికం తీసుకోవడం మూలంగా జుట్టు ఊడి పోవడం తగ్గుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. మొటిమల నివారినిగా పనిచేస్తుంది. ఇన్ని ఔషద గుణాలున్న క్యాప్సికాన్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మనకు అందబాటులో దొరికే క్యాప్సికం వాడేందుకు ఎందుకింక ఆలస్యం.. రోజు వారి కూరగాయల్లో ఒక రోజు క్యాప్సికాన్ని కూడా చేర్చుకుందాం.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ