గిన్నిస్ రికార్డు సృష్టించిన 'చైనా' న్యూడిల్...
- December 15, 2017చైనాకు చెందిన పుడ్ కంపెనీ ప్రపంచంలో అత్యంత పొడవైన న్యూడిల్ ని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని తయారీకి 40 కిలోల బ్రెడ్ పిండి, 26.8లీటర్ల నీళ్లు, 0.6 కిలోల ఉప్పుని ఉపయోగించారు. 66 కిలో గ్రాముల బరువు 10,119 అడుగులు ఉన్న ఈ న్యూడిల్ ను పూర్తిగా చేతితోనే తయారు చేశారు. ఈ న్యూడిల్ తయారుచేయడానికి 17 గంటలు పట్టిందట. గిన్నిస్ అధికారి ఈ న్యూడిల్ పొడవును లెక్క వేయడానికి 3 గంటలు పట్టిందట. 2001వ సంవత్సరంలో జపాన్ తయారుచేసిన 1800 అడుగుల పొడవైన న్యూడిల్ రికార్డును ఈ న్యూడిల్ బద్దలు కొట్టడం విశేషం. చైనా సంప్రదాయం ప్రకారం సీనియర్స్ డే రోజున న్యూడిల్ పొడవును పెద్దవారి ఆయుష్షుతో పోలుస్తారు. అది ఎంత పొడవుగా ఉంటే అంతకాలం వారి ఆయుష్షు పెరుగుతుందని నమ్ముతారు. గిన్నిస్ రికార్డు సృష్టించిన ఈ న్యూడిల్ ను చైనాకు చెందిన పుడ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అందజేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..