రామ్ చరణ్ కు విలన్ గా వివేక్ ఓబ్రాయ్
- December 17, 2017రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివేక్ ఒబెరాయ్..ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించి అలరించాడు. తాజాగా చరణ్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడని వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తి కాగానే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. జనవరి , లేదా ఫిబ్రవరి లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తో పాటు నటి నటుల ఎంపిక చేసే పనిలో బిజీ గా ఉన్నాడు బోయపాటి. అయితే ఈ యాక్షన్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకుకథ వినిపించడం , అయన నటించడానికి ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శివగామి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ ల సరసన నటించిన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు