కాశ్మీర్ ను ఎలాగైనా సొంతం చేసుకుంటాం : సయీద్ హాఫిజ్
- December 17, 2017
ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ మరోసారి భారత్ మీద విషం కక్కాడు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయడానికే జీహాద్‌ను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. లాహోర్‌లో జమాతే ఉద్ దవా మద్దతుదారులతో శనివారం హఫీజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా 1971 యుద్ధానికి భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని జమాతే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యుద్ధంలో భారత్‌ను ఓడించి.. కశ్మీర్‌కు స్వేచ్ఛ ప్రసాదించాలని మద్దతుదారులకు చెప్పారు.
బంగ్లాదేశ్ విమోచన యుద్ధంపై భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రతి పాకిస్తానీ ఎదురు చూస్తున్నాడని.. ఆ రోజు ఎంతో దూరం లేదని హఫీజ్ పేర్కొనడం విశేషం. తూర్పు పాకిస్తాన్‌ను.. పాకిస్తాన్ నుంచి విడదీనట్టు.. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని చెప్పారు. కశ్మీర్ విమోచనమే అసలైన ప్రతీకారమని హఫీజ్ సయీద్ తన మద్దతాదారులతో అన్నారు. డిసెంబర్ 16న భారత్, బంగ్లాదేశ్‌లు విజయ్ దివస్‌గా జరుపుకోవడంపై హఫీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో.. పాకిస్తాన్‌పై భారత్ అద్వితీయ విజయం సాధించింది. పాకిస్తాన్‌కు చెందిన లక్ష మంది సైనికులను భారత సైన్యం.. యుద్ధఖైదీలకు బంధించింది. తరువాత జరిగిన ఒప్పందాల్లో భారత్ పెద్ద మనసుతో వారికి క్షమాభిక్ష ప్రసాదించి వదలిపెట్టిన విషయం విదితమే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







