ఎన్‌ఆర్‌ఐలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కేసీఆర్

- December 17, 2017 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కేసీఆర్

హైదరాబాద్: చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని సీఎం కేసీఆర్ వివరించారు. ఎన్‌ఆర్‌ఐలకు ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో..ఇపుడు అదేవిధంగా తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లు వెల్లడించారు. పథకాల అమలులో సంక్షేమరంగంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com