సకాలంలో కాపాడినందుకు థాంక్స్: పుతిన్ టు ట్రంప్
- December 17, 2017మాస్కో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్ పీటర్ బర్గ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వెల్లడించినందుకు ఆయన ప్రత్యేకంగా ట్రంప్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లు రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. సెయింట్ పీటర్ బర్గ్‌లోని ప్రముఖమైన చోటు ఖజాన్ క్యాథెడ్రెల్పై బాంబులతో దాడులు చేసి పేల్చేయాలనుకున్నారని, అందుకు ఈ వారంలోనే కుట్ర చేశారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ వెల్లడించింది.
అయితే, ఆ కుట్రకు పాల్పడిన ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తాము పట్టుకున్నామని, దాంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లయిందని అన్నారు. ఈ విషయం తాము అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేయగానే ఆయన వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ఆయనకు, ఆయన నిఘా సంస్థకు ధన్యవాదాలు చెప్పినట్లు వెల్లడించారు. ఇలా ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరగడం గడిచిన వారంలోనే రెండోసారి. అంతకుముందు ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్