వరుణ్ తేజ్ కు అడ్డుపడుతున్న సాయిధరమ్ తేజ్
- December 17, 2017
మెగా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు చుట్టరికం రీత్యా వరసకు బావా బావామరుదులు అవుతారు. అటువంటి ఈ యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ మూవీ పై కన్ను వేసి అనుకోకుండా వ్యవహరిస్తున్న తీరు చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న ఒక మూవీకి 'తోలి ప్రేమ' అన్న టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడ విడుదల అయిపోయిన తరువాత ఇప్పుడు అనుకోకుండా సాయి ధరమ్ తేజ్ సీన్ లోకి ఎంటర్ కావడం హాట్ న్యూస్ గా మారింది. దీనికి కారణం దర్శకుడు కరుణాకరన్. ఇతడు గతంలో పవన్ తో తీసిన 'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చాల సినిమాలు తీసినా ఆ సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి.
దీనితో ఈదర్శకుడు సాయి ధరమ్ తేజ్ తో త్వరలో ఒక లవ్ స్టోరీ మూవీని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈమూవీ కథ ఇంచుమించు పవన్ 'తొలి ప్రేమ' ఛాయలతో ఉంటుందట. అయితే ఇప్పటికే 'తొలి ప్రేమ' టైటిల్ ను వరుణ్ తేజ్ కార్నర్ చేయడంతో మరో టైటిల్ కోసం కరుణా కరన్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.
వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న 'తొలి ప్రేమ' కు పవన్ గతంలో నటించిన 'తొలి ప్రేమ' కు ఎటువంటి సంబంధం లేకపోయినా సాయి ధరమ్ తేజ్ కరుణా కరన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కథకు మాత్రం ఖచ్చితంగా 'తొలి ప్రేమ' చాయాలు ఉంటాయని టాక్. ఈసినిమా వచ్చే ఏడాది మధ్యలో విడుదల కాబోతోంది. దీనితో 'తొలి ప్రేమ' టైటిల్ ను వాడుకుంటూ వరుణ్ తేజ్ అదేవిధంగా 'తొలి ప్రేమ' దర్శకుడుని ఉపయోగించుకుంటూ సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల