రియాద్ లో చెట్లకు దుప్పట్లు ..సహాయం పట్ల చప్పట్లు కొడుతున్న పేదలు
- December 17, 2017
జెడ్డా : 'ఎముకలు కొరికే చలికాలంలో ఇల్లు వాకిలి లేని నిరుపేదలు ఎలా చీకటి రాత్రుళ్ళు ఎలా గడుపుతారనే యోచించే మంచి మనసున్నవారికి మార్గం ఉంటుంది ' రియాదే లో కొందరు నివాసితులు శీతాకాలంలో అవసరం ఉన్న పేదలకు వినూత్నసహాయం చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. దేశంలో గత కొన్నేళ్ల నుంచి శీతాకాలలు అత్యంత దుర్భరంగా మారేయని వాతావరణ నిపుణులు సైతం ఇటీవల పేర్కొంటున్నారు. దేశ రాజధాని రియాద్ లో చలిని తట్టుకునేందుకు ఎవరైనా నేరుగా దుప్పట్లు..స్వెట్టర్లు ..మఫలర్లు...తదితర ఉన్ని దుస్తుల ప్యాకెట్లు చెట్లకు వేలాడేవిధంగా నివాసితులు ఏర్పాటు చేశారు. ఈ తరహా సహాయంకు సంబంధించిన వీడియోలు..ఫోటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేయబడి ప్రస్తుతం వైరల్ గా మారింది. రాయ్యాన్ జిల్లాలో సుల్తాన్ అల్-మౌసా అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ విధమైన దాతృత్వ కార్యక్రమాలను ప్రోత్సాహించడం ద్వారా మరింతమంది ఆ తరహా సహాయం చేసేందుకు ముందుకువచ్చేలా ఆశిస్తూ తాను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినట్లు చెప్పారు. అల్-ఓద్, అల్ బాతః మరియు మన్ఫూహా వంటి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలున్న ఈ ప్రాంతాల్లో ఈ చర్యలు వ్యతిరేక ప్రభావాన్ని చూపించగలవని స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఈ సందర్భంగా రియాద్ లోని స్థానిక నివాసి ఉమ్ యాజాన్ మాట్లాడుతూ " ఈ చొరవ.. ఆలోచన అభినందనీయం..ఈ చలికాలంలో పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, కానీ మధ్యతరగతి పౌరులు నివసించే అల్-రేయాన్ ప్రాంతంలో సైతం చెట్లపై దుప్పట్లు వేలాడదీయడం అంత మంచి పధ్ధతి కాదంటూ.. మా ప్రాంతంలో ఈ తరహా సహాయం గౌరవనీయమైనది కాదు అయితే ముందుగానే వారు కొంత ఆలోచన చేసి ఉండాలని విమర్శిస్తున్నారు. "
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







