వరుణ్ తేజ్ కు అడ్డుపడుతున్న సాయిధరమ్ తేజ్
- December 17, 2017మెగా యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ లు చుట్టరికం రీత్యా వరసకు బావా బావామరుదులు అవుతారు. అటువంటి ఈ యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్ మూవీ పై కన్ను వేసి అనుకోకుండా వ్యవహరిస్తున్న తీరు చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న ఒక మూవీకి 'తోలి ప్రేమ' అన్న టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడ విడుదల అయిపోయిన తరువాత ఇప్పుడు అనుకోకుండా సాయి ధరమ్ తేజ్ సీన్ లోకి ఎంటర్ కావడం హాట్ న్యూస్ గా మారింది. దీనికి కారణం దర్శకుడు కరుణాకరన్. ఇతడు గతంలో పవన్ తో తీసిన 'తొలి ప్రేమ' బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చాల సినిమాలు తీసినా ఆ సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి.
దీనితో ఈదర్శకుడు సాయి ధరమ్ తేజ్ తో త్వరలో ఒక లవ్ స్టోరీ మూవీని మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఈమూవీ కథ ఇంచుమించు పవన్ 'తొలి ప్రేమ' ఛాయలతో ఉంటుందట. అయితే ఇప్పటికే 'తొలి ప్రేమ' టైటిల్ ను వరుణ్ తేజ్ కార్నర్ చేయడంతో మరో టైటిల్ కోసం కరుణా కరన్ ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.
వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న 'తొలి ప్రేమ' కు పవన్ గతంలో నటించిన 'తొలి ప్రేమ' కు ఎటువంటి సంబంధం లేకపోయినా సాయి ధరమ్ తేజ్ కరుణా కరన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కథకు మాత్రం ఖచ్చితంగా 'తొలి ప్రేమ' చాయాలు ఉంటాయని టాక్. ఈసినిమా వచ్చే ఏడాది మధ్యలో విడుదల కాబోతోంది. దీనితో 'తొలి ప్రేమ' టైటిల్ ను వాడుకుంటూ వరుణ్ తేజ్ అదేవిధంగా 'తొలి ప్రేమ' దర్శకుడుని ఉపయోగించుకుంటూ సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ప్రయోగాలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి..
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు