సకాలంలో కాపాడినందుకు థాంక్స్: పుతిన్ టు ట్రంప్
- December 17, 2017
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్ పీటర్ బర్గ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వెల్లడించినందుకు ఆయన ప్రత్యేకంగా ట్రంప్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లు రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. సెయింట్ పీటర్ బర్గ్‌లోని ప్రముఖమైన చోటు ఖజాన్ క్యాథెడ్రెల్‌పై బాంబులతో దాడులు చేసి పేల్చేయాలనుకున్నారని, అందుకు ఈ వారంలోనే కుట్ర చేశారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ వెల్లడించింది.
అయితే, ఆ కుట్రకు పాల్పడిన ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తాము పట్టుకున్నామని, దాంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లయిందని అన్నారు. ఈ విషయం తాము అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేయగానే ఆయన వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ఆయనకు, ఆయన నిఘా సంస్థకు ధన్యవాదాలు చెప్పినట్లు వెల్లడించారు. ఇలా ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరగడం గడిచిన వారంలోనే రెండోసారి. అంతకుముందు ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల