బీచ్ ఫెస్టివల్‌కు ముస్తాబవుతున్న కాకినాడ తీరం
- December 17, 2017
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎన్టీఆర్ సాగర తీరం బీచ్ ఫెస్టివల్‌కు ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఈ సంబరాన్ని నిర్వహించడానికి పర్యాటక శాఖ, జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రాష్ట్రంలోని 13 జిల్లాల పర్యాటకులను ఆకర్షించేలా ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల తొలిరోజు 19న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరి, రెండో రోజు 20న సినీ సంగీత నేపథ్య గాయకులతో స్టార్‌నైట్, ఆఖరి రోజు 21న స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఉత్సవాలకు సుమారు ఆరు లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సంబరాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభిస్తారు. మంత్రులు చినరాజప్ప, అఖిలప్రియ, కిమిడి కళావెంకట్రావు, శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రమణ్యం తదితరులు హాజరుకానున్నారు. పూల ప్రదర్శనతో పాటు జలక్రీడలు, హేలీరైడింగ్, పారాసైలింగ్, పారాగ్లైడింగ్, స్పీడ్‌బోట్లు, ఇసుకలో మోటారుసైకిల్ రైడింగ్ వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







