అజ్మన్‌లో అగ్ని ప్రమాదం: ఒకరి మృతి
- December 17, 2017అజ్మన్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 రిటైయిల్ ప్లేసెస్ దగ్ధమయ్యాయి. ఓ వ్యక్తి మృతి చెందారు. అజ్మన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దుల్అజీజ్ అల్ షామ్షి ఈ ఘటనపై మాట్లాడుతూ, సాయంత్రం 4 గంటల సమయంలో అగ్ని ప్రమాదంపై ఫిర్యాదు అందిందనీ, నిమిషాల వ్యవధిలోనే ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసినట్లు చెప్పారు. గాలుల ప్రభావంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు ఆయన వివరించారాయన. దుబాయ్, అజ్మన్, షార్జా, ఉమ్ అల్ ఖైవాన్ నుంచి కూడా టీమ్స్ వచ్చి, అదనంగా సపోర్ట్ అందించాయని, అంబులెన్స్‌లు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ టీమ్స్, మునిసిపాలిటీ నుంచి మరో టీమ్ సంఘటనా స్థలంలో సేవలు అందించాయని చెప్పారు. ఈ క్రమంలో ఫైర్ ఫైటర్స్ ఓ మృతదేహాన్ని సంఘటనలో కనుగొన్నట్లు వెల్లడించారు అబ్దుల్ అజీజ్ అలి అల్ షామ్షి. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు. మంటల్ని ఆర్పివేసిన తర్వాత ప్రమాద స్థలాన్ని అజ్మన్ పోలీస్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆధీనంలోకి ఇచ్చేశామని వివరించారాయన.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..