మహేష్ కోసం బొద్దుగా మారిన అల్లరోడు
- December 17, 2017
ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మద్య మల్టీ స్టారర్ సినిమాలకు మంచి ఆదరణ లభించడంతో దర్శక, నిర్మాతలు అలాంటి చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా నలుగురు యువ హీరోలు సుధీర్, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ కలిసి నటించిన 'శమంతకమణి' సినిమా కూడా నాట్ బ్యాడ్ అనిపించుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు మరో మల్టీ స్టారర్‌తో వస్తున్నాడు.
అయితే, ఈ సారి అల్లరోడితో కలిసి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం నరేష్ బరువు పెరగాల్సి వచ్చిందట. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన నరేష్ లావుగా కనపడేసరికి.. అంతా ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటీ అని ఆరా తీస్తే మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి తీస్తున్న సినిమా కోసం అల్లరోడు అలా బొద్దుగా మారిపోయాడని తెలిసింది.
దీనిపై అల్లరి నరేష్ కూడా స్పందిస్తూ మహేష్ సినిమా కోసం తనను అడిగారని కూడా చెప్పారు. అయితే ఇందులో నటించే విషయంపై మాత్రం ఏ క్లారిటీని ఇవ్వలేదు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు ఆ మూవీ కోసం అల్లరి నరేష్ బరువు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'భరత్ అనే నేను' సినిమాతో రానున్నాడు.
ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే మహేష్ - నరేష్ సినిమా మొదలుకానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







