రైల్వేలో డైనమిక్ ప్రైసింగ్ పాలసీ
- December 17, 2017
టిక్కెట్లు, స్టార్ హోటళ్ల తరహాలో ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని రైల్వేల్లోనూ 2016 సెప్టెంబరు నుంచి అమలుచేస్తోంది. అయితే ఈ విధానం కొన్ని ప్రత్యేక రైళ్లకు మాత్రమే వర్తిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ విధానాన్ని తర్వలోనే సమీక్షిస్తామని రైల్వే శాఖ మంత్రి పీయూశ్ గోయల్ తెలియజేశారు. ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని సమీక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వేలో డైనమిక్ ప్రైసింగ్ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.విమాయాన సంస్థలు టిక్కెట్లలో రాయితీలు అందజేస్తున్న మాదిరిగానే రైల్వేలోనూ కల్పిస్తామని అన్నారు. పూర్తిస్థాయిలో నిండని రైళ్లలో టికెట్లపై రాయితీలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తానమని తెలియజేశారు. విమానాల్లో ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటే వాటిని నింపడానికి అప్పటికప్పుడు డిస్కౌంట్లు ఇస్తాయని, దీని వల్ల ప్రయాణీకులకు లబ్ద కలుగుతుందని అన్నారు.ఆన్‌లైన్ ద్వారా హోటల్ రూములు బుక్ చేసుకునేటప్పుడు తొలుత తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని, తర్వాత పెరుగుతాయని, ఆ తర్వాత మిగిలిన వాటికి రాయితీలు, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తారని, అదే విధానాన్ని రైల్వేలోనూ అమలు చేస్తామని వివరించారు.ఫ్లెక్సీ-ఫేర్ విధానాన్ని సమీక్షించేందుకు ఈనెల 11న ఆరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైల్వే టికెట్లపై రాయితీలు ఇచ్చే విషయాన్ని అధ్యయనం చేసి అనంతరం 30 రోజుల్లో తన నివేదికను అందజేస్తుంది. ప్రయాణీకులు లబ్ది కలిగేలా ప్రతిపాదనలు ఉండాలని ఈ కమిటీకి రైల్వేబోర్డు సూచించింది. రద్దీ సమయాల్లోనూ ప్రయాణీకులకు ధరలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది.
కమిటీ నివేదికలోని అంశాలను పరిశీలించి రాయితీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రైల్వేల్లో ఫ్లెక్సీ-ఫేర్ విధానం వల్ల చార్జీలు 50 శాతం వరకు పెరిగాయి. అయితే బేస్ ఫేర్ 10 శాతం నుంచి 50 శాతానికి పెరగడంతో రైల్వేకు ఆదాయం పెరిగింది. అదే సమయంలో ప్రయాణీకుల సంఖ్య తగ్గింది. దీంతో కొన్ని రైళ్లలో బెర్తులు ఖాళీగా ఉండిపోతున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్‌లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







