'ఎంసిఎ' పార్టీలో సాయిపల్లవి స్టెప్స్ తో హంగామా
- December 17, 2017నాని హీరోగా నటిస్తున్న 'ఎంసిఎ' మూవీ షూటింగ్ లో సాయి పల్లవికి నానీకి భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి అని వార్తలు వచ్చిన నేపధ్యం తెలిసిందే. అయితే ఈ వార్తలతో సంబంధం లేకుండా నానీతో ఒక ఫ్యామిలీ పార్టీలో సాయి పల్లవి హంగామా చేసిన పార్టీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హడావిడి చేస్తోంది.
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే 'ఎంసిఎ' సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా ఈ సినిమా నిర్మాత దిల్ రాజ్ మరో ట్రైలర్ ను రిలీజ్ చేసాడు. ఫ్యామిలీ పార్టీ అంటూ సాగే ఈపాట భూమిక రాజీవ్ కనకాలకు సంబంధించిన ఒక ఫంక్షన్ లో జరుగుతున్నట్లు ఈ ట్రైలర్ చూసినవారికి అర్థమవుతుంది.
'ఫిదా' సినిమాలో 'వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే' అంటూ తన స్టెప్పులతో హంగామా చేసిన సాయిపల్లవి ఈపాటలో కూడ తన స్టెప్స్ తో హంగామా చేసింది. ట్రాన్స్ పోర్ట్ మాఫియాకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేటు బస్సుల దోపిడీకి సంబంధించిన నేపధ్యంలో ఈ మూవీ కథను అల్లినట్లుగా తెలుస్తోంది.
ఈసినిమాకు అఖిల్ 'హలో' నుండి ఎదురౌతున్న పోటీ నేపధ్యంలో దిల్ రాజ్ ఈమూవీ ప్రమోషన్ ను చాలా వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ద్వారా ఈమూవీ పై పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసిన 'ఎంసిఎ' ఈ లేటెస్ట్ నాని ఫ్యామిలీ పార్టీ సాంగ్ తో ప్రేక్షకులలో మరింత చొచ్చుకుపోయే అవకాసం ఉంది..
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు