గుజరాతీ వంటకాలతో సంబరాలు చేసుకుంటున్న భాజపా నాయకులు
- December 18, 2017
భోపాల్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గుజరాత్‌లో అధికార భాజపా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం భాజపా అక్కడ 10 స్థానాల్లో గెలుపొంది.. మరో 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ భాజపాకు కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తోంది. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా గెలుపు ఖాయమైంది.
రెండు రాష్ట్రాల్లో భాజపా విజయంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. మిఠాయిలు పంచి, టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పార్టీ కార్యకర్తలు గెలుపు వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రజలు ఇష్టంగా తినే డోక్లా, ఫఫ్దా తదితర ప్రముఖ వంటకాలను భోపాల్ ప్రధాన కార్యాలయంలోని క్యాంటీన్ మెనూలో చేర్చారు. ఈ రోజు వాటిని కార్యకర్తలు ఇష్టంగా తింటున్నారు. గుజరాత్‌లో భాజపా విజయానికి గుర్తుగా ఆ రాష్ట్ర వంటకాల రుచి చూస్తున్నామని కార్యకర్తలు ఆనందంగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల