సల్మాన్‌ను చంపేందుకు కుట్ర.!
- January 12, 2018బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను చంపడానికి కొందరు దుండగులు ఆయన సినిమా 'రేస్ 3' సెట్ పరిసరాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు బాంద్రాలోని ఆయన ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 'సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులకు హానితలపెడుతామని బెదిరింపులకు పాల్పడటం ఇది తొలిసారి కాదు. అయినా సల్మాన్ బాడీగార్డులు లేకుండా బయటికి వస్తున్నారు.. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు మరింత భద్రత అవసరం' అని సీనియర్ ఇన్స్పెక్టర్ అన్నారు. మరోపక్క నిర్మాత రమేశ్ 'రేస్ 3' సినిమా సెట్‌కు భద్రత పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
గురువారం పోలీసులు ముంబయి ఫిల్మ్‌సిటీలో 'రేస్ 3' సినిమా సెట్‌కు వెళ్లారు. షూటింగ్ ఆపాలని, వీలైనంత తొందరగా సల్మాన్‌ను తన ఇంటికి పంపించాలని నిర్మాత రమేశ్ తౌరాని కోరారు. అనంతరం స ల్మాన్ ఆరుగురు పోలీసులతో కలిసి వేరే కారులో ఇంటికి బయలుదేరారు. ఆయన సొంత కారులో మరికొందరు పోలీసులు ఇంటికి చేరుకున్నారు.
సల్మాన్ కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లారు . ఈ క్రమంలో అక్కడ జింకను చంపాడన్న కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం తుది విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా ఇటీవల సల్మాన్ జోధ్‌పూర్ కోర్టుకు వెళ్లారు.
మరోకేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయ్‌ను పోలీసులు అదే సమయంలో భద్రత మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. ఈ సమయంలో లారెన్స్.. సల్మాన్‌ను చంపుతామని, ఆయనకు తమ పవర్ తెలియాలని బెదిరించాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ