జియోకాయిన్ ను ప్రవేశపెట్టనున్న ముకేశ్ అంబానీ
- January 12, 2018
టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరో సంచలనం సృష్టించబోతున్నారు. జియోకాయిన్ పేరుతో సొంత క్రిప్టోకరెన్సీని సృష్టించాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్లాన్ చేస్తోంది. 50 మంది యంగ్ సభ్యుల టీమ్‌తో బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై జియో పనిచేస్తుందని లైవ్‌మింట్ రిపోర్టు చేసింది. దీనికి అధినేతగా ముఖేష్ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ సారథ్యం వ్యవహరిస్తున్నారని తెలిసింది. క్రిప్టోకరెన్సీ రూపకల్పన, దాని విక్రయం వంటి అన్ని అంశాలను ఈ టీమ్ పరిశీలిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బిట్‌కాయిన్ వంటి ఊహాజనితమైన వర్చ్యువల్ కరెన్సీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
వీటిల్లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ వ్యాపారంపై కన్నేసినట్టు లైవ్‌మింట్ పేర్కొంది. బిట్‌కాయిన్ వంటి క్రిపోకరెన్సీలకు పోటీగా తన సొంత క్రిప్టోకరెన్సీ-జియోకాయిన్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపింది. అయితే క్రిప్టోకరెన్సీలో పెట్టబుడులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. ఇది చట్టవిరుద్ధమైన కరెన్సీగా ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఇందులో పెట్టుబడులు పెట్టరాదని పెట్టుబడిదారులను హెచ్చరించారు. బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు గ్యారెంటీ ఉండదని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







