యెమెన్కు 1.5బిలియన్ డాలర్ల సౌదీ మిత్రదేశాల సాయం

- January 23, 2018 , by Maagulf
యెమెన్కు 1.5బిలియన్ డాలర్ల సౌదీ మిత్రదేశాల సాయం

సనా : యెమెన్‌కు 1.5బిలియన్‌ డాలర్ల ( రూ.9,566 కోట్లు ) సాయం అందజేయనున్నట్టు సౌదీ మిత్రదేశాలు ప్రకటించాయి. ఐరాస అభ్యర్థన మేరకు తామీ సాయం చేయనున్నట్టు పేర్కొన్నాయి. యెమెన్‌లో 2015లో అంతర్యుద్ధం చెలరేగింది. యుద్ధవాతావరణం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంతర్యుద్ధం కారణంగా దాదాపు 10వేల మంది చనిపోయారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. ప్రాథమిక అవసరాలు అందక ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. అంతేగాకుండా, అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆకలికేకలతో యెమెన్‌ తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్‌ పౌరులకు సాయం అందించాలని ప్రపంచ దేశాలకు ఇటీవల ఐరాస పిలుపునిచ్చింది. ఐరాస నివేదిక ప్రకారం...యెమెన్‌లో 2కోట్ల 20లక్షల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.80లక్షల మంది అర్ధాకలితో అలమటిస్తున్నారు. వారిలో 18లక్షల మంది చిన్నారులు ఐదేండ్ల లోపువారున్నారు. యెమెన్‌లో కలరా వ్యాధి వ్యాపించడంతో ప్రజలు అనేక ఇబ్బందులుపడుతున్నారు. సౌదీ మిత్రదేశాలు తమకు సహకరిస్తున్నందుకు యెమెన్‌ అధ్యక్షుడు అబ్దు రబు మన్సూర్‌ హాదీ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com