నిమ్మరసం వేడి నీటిలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
- January 26, 2018ఉదయం నిద్రలేస్తూనే గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపు పండ్ల చిగుళ్లు దెబ్బతింటాయి.అందుకే.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. చాలామంది జిమ్, జాగింగ్ వెళ్ళినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితేనే బెటర్. నీళ్లు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తెనెను కలపకూడదు . కొందరైతే వేడినీటి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటూ ఆరోగ్యకరమైనది కాదు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..