ఫేక్ గన్‌తో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
- February 12, 2018సౌదీ అరేబియా: సౌదీ పోలీస్, నైజీరియాకి చెందిన వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్‌లోని సౌదీ కుటుంబాన్ని ఫేక్ గన్‌తో బెదిరించి పట్ట పగలే నిందితుడు దోపిడీకి పాల్పడ్డాడు. రియాద్‌లో ఇలాంటి దొంగతనం ఇంతకుముందెన్నడూ జరగలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన టేటాను పోలీసులు విశ్లేషించారు. అనంతరం 38 ఏళ్ళ నిందితుడ్ని ట్రాప్ చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం చేసే క్రమంలో సెక్యూరిటీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. గేట్ దూకిన నిందితుడు సర్వైలెన్స్ కెమెరాని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాడు. విల్లాలోని మహిళను ఫేక్ గన్‌తో బెదిరించగా, ఆమె కుమారుడు సకాలంలో అక్కడికి చేరుకుని, దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా, దొంగ పారిపోయాడు. అనంతరం అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాలతో దొంగతనాలకు పాల్పడేవారిపై సౌదీలో కఠిన చర్యలుంటాయి. మరణ శిక్షలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది నిందితులకి.
తాజా వార్తలు
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!