Maa Gulf
తప్పిపోయిన భారతీయుడికోసం బహ్రెయిన్‌లో కొనసాగుతున్న 'సెర్చ్‌'

తప్పిపోయిన భారతీయుడికోసం బహ్రెయిన్‌లో కొనసాగుతున్న 'సెర్చ్‌'

మనామా: 60 ఏళ్ళ భారత జాతీయుడొకరు గడచిన వారం రోజులుగా తప్పిపోవడంతో అతన్ని కనుగొనేందుకు 'సెర్చ్‌' ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇండియన్‌ టాలెంట్‌ అకాడమీలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేస్తున్న తిలకన్‌ ఒండాయంకరన్‌ అనే వ్యక్తి ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కన్పించడంలేదు. తాము నడుపుతోన్న అకాడమీలో తిలకన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేస్తున్నారనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని ఇండియన్‌ టాలలెంట్‌ అకాడమీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లతీష్‌ భరతన్‌ చెప్పారు. ఫిబ్రవరి 4న ఉదయం 9 గంటల సమయంలో మనామా మార్కెట్‌కి బస్‌లో వెళ్ళారనీ, స్టూడెంట్స్‌ కోసం జెర్సీలు కొనేందుకు వెళ్ళిన ఆయనతో ఉదయం 10.30 గంటల సమయంలో మాట్లాడననీ, ఆ తర్వాత 11 గంటల నుంచి అతని ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోందని చెప్పారు భరతన్‌. పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు, ఎంబసీ సాయాన్ని కూడా కోరినట్లు ఆయన వివరించారు. గత 30 ఏళ్ళుగా తిలకన్‌తో తనకు స్నేహం ఉందని చెప్పారాయన. తిలకన్‌ కుమారుడు సైతం తన తండ్రి ఆచూకీ ఫిబ్రవరి 4వ తేదీ నుంచి దొరకడంలేదని చెప్పారు.