ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం!
- February 18, 2018ఇస్లామాబాద్ : మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మూడో వివాహం చేసేసుకున్నారు. ఆధ్మాత్మిక గురువు బుష్రా మనేకాను పరిణాయమాడినట్లు పీటీఐ అధికారికంగా వెల్లడించింది.
ఆదివారం లాహోర్‌లోని బుష్రా మనేకా(పింకీ పీర్) సోదరుడి ఇంట్లో ఈ వేడుక జరిగినట్లు పీటీఐ అధికార ప్రతినిధి పవాద్ చౌదరి వెల్లడించారు. కాగా, గత జనవరి నుంచి వీరిద్దరి వివాహం గురించి మీడియాలో ప్రముఖంగా వార్తలు రాగా.. పీటీఐ వాటిని ఖండిస్తూ వస్తోంది.
1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. కొంతకాలంగా ఆయన ఒంటరిగా ఉంటున్నారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం