హత్య కేసులో వ్యక్తి ఒమన్‌లో అరెస్ట్
- February 19, 2018సహచరుడి హత్య కేసులో ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని అల్ హయిల్లోని వాడిలో పోలీసులు కనుగొన్నారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఉంది ఈ ప్రాంతం. హత్య కేసు ఛేదించే క్రమంలో నిందితుడి కోసం వెతుకుతున్న పోలీసులకు లభించిన ఆధారాలతో, నిందితుడి సహచరుడ్ని గుర్తించారు. అరెస్టయిన వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడ్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించామని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మస్కట్ పోలీస్ కమాండ్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ అలాగే ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అల్ కౌద్ పోలీస్ స్టేషన్, క్రైమ్ ప్రివెన్షన్ డిపార్ట్మెంట్, సంయుక్తంగా ఆసియా జాతీయుడి మృతి కేసుని డీల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లిచి పండుని ఆరోగ్యానికి మంచిదేనా.?
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..