ఏషియన్ రెస్టారెంట్‌లో వ్యక్తి హత్య
- February 19, 2018
33 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఆసియన్ రెస్టారెంట్‌లో హత్యకు గురయ్యాడు. నహ్దా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏషియన్ రెస్టారెంట్‌లో పాకిస్తానీ వ్యక్తిని పలుమార్లుప పొడిచి చంపారు. మృతుడ్ని ఎంఎ ఖాన్‌గా గుర్తించాఉ. కిచెన్ నైఫ్‌తో అతన్ని చంపేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుండగా, వారి మధ్య తగాదా ప్రారంభమయ్యిందనీ, ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, మృతుడ్ని బలంగా పొడిచాడని తెలియవస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఫోరెన్సిక్, సీఐడీ, క్రైమ్ సీన్, పెట్రోల్, అంబులెన్స్ విభాగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. రెస్టారెంట్‌లో ఉన్నవారిని విచారించి, వివరాల్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్‌పై ఖచ్చితమైన సమాచారం లేదు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







