హనుమంతరావు లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన దర్శకులు వీరే...! అనంతరం
- February 19, 2018
గుండు హనుమంతరావు స్టేజ్ మీద నటిస్తున్న సమయంలో జంధ్యాల చూసి.. సినిమాల్లో నటించే అవకాశం ఇస్తా అని చెప్పి.. సత్యాగ్రహం సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ గుండు హనుమంతరావు కి బ్రేక్ ఇచ్చిన సినిమా 'అహనాపెళ్లంట'. జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ నిర్మించింది. ఈ మూవీలో నటిస్తున్న సమయంలో హనుమంతరావు కి 30 ఏళ్ళు.. అయినా 60 ఏళ్ల సీనియర్ సిటిజన్ గా అద్భుతంగా గా నటించారు. ఈ సినిమాలో గుండు హనుమంతరావు నటనను చూసిన చిత్ర నిర్మాత రామానాయుడు ఫిదా..! ఇటువంటి నటుడిని సినీ పరిశ్రమ వదులుకోకూడదు అని భావించిన రామానాయుడు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ అవకాశం ఇస్తూ ప్రోత్సహించారు. ఇక హాస్యానికి పెద్ద పీటను వేసిన దర్శకుడు ఇవివి సత్యనారాయణ తన మొదటి సినిమా చెవిలో పువ్వు సినిమాలో మంచి పాత్రను ఇచ్చారు.. ఇక హాస్య సినిమాలను తెరకెక్కిస్తూ... అదే సమయంలో పాపులర్ అయిన ఎస్వీ కృష్ణా రెడ్డి కూడా గుండు హనుమంతరావుకి మంచి పాత్రలను ఇచ్చారు. కొబ్బరిబొండం సినిమా తో మొదలైన వీరిద్దరి జర్నీ ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ కీలక పాత్రలు పోషించారు. ఈ దర్శకుల సినిమాలు తగ్గిన తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో గుండు హనుమంతరావు బుల్లి తెరపై అమృతం సీరియల్ తో అడుగు పెట్టారు.. అక్కడ కూడా తనదైన హాస్యంతో పేరు సంపాదించుకొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







