ఫ్లైట్ జర్నీ చేయనున్నారా...అయితే ఇవి తినకండి.!
- February 19, 2018
ప్రయాణాల్లో ఉన్నప్పుడు కొందరు ఆహారం అస్సలు తీసుకోరు. ఇక కొందరు లిమిటెడ్‌గా ఫుడ్ తింటారు. మరికొందరు అయితే ఇలాంటివేవీ పట్టించుకోరు. అదే పనిగా ఆహారాన్ని లాగించేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా తమ సౌకర్యానికి అనుగుణంగానే ప్రయాణాల్లో ఆహారం తీసుకుంటారు. కానీ విమానాల్లో ప్రయాణం చేయడానికి వెళ్లే వారు మాత్రం ప్రయాణానికి ముందుగా ఈ ఆహారాలను మాత్రం అస్సలు తినరాదు. మరి ఆ ఆహారాలు ఏమిటో, వాటిని విమానం ఎక్కేముందు ఎందుకు తినరాదో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఫ్రై పదార్థాలు:
విమానంలో ప్రయాణించడానికి ముందు ఫ్రై చేసిన ఆహారాలను అస్సలు తినరాదు. ఇవి ఎక్కువగా ఆయిల్స్‌ను కలిగి ఉంటాయి. దీంతో అసిడిటీని కలిగిస్తాయి. కడుపులో మంట, నొప్పి రావచ్చు. అంతే కాకుండా వీటిలో అధికంగా ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా నీటిని స్టోర్ చేసుకుంటుంది. దీంతో ముఖ్యంగా పాదాల వద్ద నీరు చేరి అవి ఉబ్బిపోతాయి. ఎక్కువ సేపు కూర్చుంటారు కనుక, సమస్య మరింత ఎక్కువవుతుంది.
2. బ్రొకోలి:
బ్రొకోలి నిజానికి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కానీ దీన్ని విమానం ఎక్కేముందు మాత్రం తినరాదు. తింటే గ్యాస్ సమస్య బాధిస్తుంది. అంత త్వరగా జీర్ణం కాదు. ఆహారం జీర్ణం అయ్యేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
3. శీతల పానీయాలు:
విమానంలో ప్రయాణించడానికి ముందు సోడా, కూల్ డ్రింక్స్ వంటి కార్బొనేటెడ్ శీతల పానీయాలను అస్సలు తాగరాదు. ఇవి గ్యాస్, అసిడిటీలకు కారణమవుతాయి.
4. యాపిల్స్:
యాపిల్స్ చాలా ఆరోగ్యకరమైన ఆహారం అని అందరికీ తెలుసు. కానీ విమానంలో ప్రయాణించడానికి ముందు యాపిల్స్‌ను తినరాదు. తింటే వీటిలో ఉండే ఫైబర్ జీర్ణం కాక సమస్యలను సృష్టిస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీలు వస్తాయి.
5. ఆల్కహాల్:
మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. హ్యాంగోవర్ వస్తుంది. దీనికి జెట్‌లాగ్ తోడైతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక విమానాల్లో ప్రయాణించే వారు ఆల్కహాల్‌ను సేవించరాదు.
6. బీన్స్:
చిక్కుడు జాతికి చెందిన ఆహారాలను విమానంలో ప్రయాణించేవారు తినరాదు. తింటే గ్యాస్, దుర్వాసన వస్తాయి.
7. మాంసం:
విమానాల్లో ప్రయాణించే వారు మాంసం తినరాదు. తింటే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టి గ్యాస్, అసిడిటీ వస్తాయి. ప్రయాణంలో అసౌకర్యంగా ఉంటుంది.
8. కారం:
విమాన ప్రయాణం చేసే వారు తినకూడని ఆహారాల్లో మరొకటి కారం ఉన్నవి. వీటి వల్ల జీర్ణాశయంలో అసౌకర్యం కలిగేందుకు అవకాశం ఉంటుంది.
9. కాఫీ:
మీకు కాఫీ ఎంత ఇష్టమైనా సరే విమాన ప్రయాణంలో మాత్రం తాగరాదు. అది జీర్ణాశయంలో ఇబ్బందులను సృష్టిస్తుంది. తలనొప్పి, వికారం, డీహైడ్రేషన్ సమస్యలను తెచ్చి పెడుతుంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!