భవనం పైనుంచి పడి 3 ఏళ్ళ చిన్నారి మృతి
- March 13, 2018మూడేళ్ళ అరబ్ బాలిక, అబుదాబీలోని ఓ భవనం 12వ అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయింది. కిటికీకి దగ్గరలో ఫర్నిచర్ వుండటంతో, ఆ ఫర్నిచర్పైకెక్కి, అక్కడి నుంచి ఆ బాలిక కిందకు పడిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఖలిదియా ప్రాంతంలో మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన గురించి సమాచారం అందుకోగానే పోలీస్ మరియు పారామెడిక్స్ అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ బాలిక మృతి చెందింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ - మెట్రో పాలిటన్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ హమాద్ అల్ నియాది మాట్లాడుతూ, చిన్న పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయడం మంచిది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. నిర్లక్ష్యమే ఓ చిన్నారిని బలికొందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు