'గోరువంక' గా మారిన 'గొల్లభామ'
- March 21, 2018సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు రావాలంటే పెద్ద పరీక్షే ఈ రోజుల్లో..ఎందుకంటే ఎప్పుడు ఎవరి ఎలా వారి మనోభావాలు దెబ్బ తీసుకుంటారో అర్దం కావడంలేదు.ఒక సీన్ వస్తే ఫలానా వారిని కించపరిచారంటూ కంప్లైంట్..డైలాగ్ వినిపిస్తే మా కులాన్ని తిట్టారంటూ కేసు నమోదు..ఆఖరుకి పాటల్లో చిన్న చిన్న పదాలను కూడా వివాదస్పదం చేస్తూ ఉంటే. రచయితలకు పెద్ద పరీక్ష కాక మరేమిటి..అందుకే ఎంతో క్షుణ్ణంగా ఆచితూచి అడుగులేస్తున్నారు.ఎంతో పక్కా ప్లాన్ తో ఫర్ఫెక్ట్ గా ముందుకు వెళ్లే మన లెక్కల మాష్టారు సుకుమార్ గారి సినిమాకు కూడా బ్రేకులు పడ్డాయి.. దాన్ని సుక్కు ఎలా క్లియర్ చేశారో తెలుసా.?
రంగమ్మ.మంగమ్మ. ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు..రంగస్థలంలోని ఈ పాట ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది .అయితే ఈ పాటలో గొల్లభామ అనే ఒక పదం తమ కులం వారిని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలొచ్చాయి.దాంతో సుక్కు వెంటనే అలర్ట్ అయ్యారు..ఆ పదానికి సంభందించి వివరణ ఇచ్చారు.మరోవైపు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి.గొల్లభామ అనే పురుగుకి ,గొల్లల కులానికి సంభందం ఏంట్రా బాబు అంటూ బహిరంగంగానే విమర్శించారు చాలా మంది.
సుకుమార్ వివరణ ఇచ్చినప్పటికి సదరు మనోభావాలు గాయపర్చుకున్నవారు వెనక్కి తగ్గకపోవడంతో..ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని అనుకున్నారు సుకుమార్..దాంతో ఆ పాటలో గొల్లభామ అని వచ్చే చోట గోరువంక అని మార్చారు..ప్రస్తుతం ఆడియో లో గొల్లభామ వినిపించిన కానీ సినిమాలో మాత్రం గొల్లభామ బదులు గోరువంక అని వినిపిస్తుంది..గతంలో దువ్వాడ జగన్నాధమ్ సినిమాలో కూడా గుడిలో ఒడిలో పాటలో పదాలు మార్చాలని వివాదం అవ్వడం,దర్శకుడు మార్చడం మనకు తెలిసిందే..
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ