'మహానటి' ఫస్టులుక్...
- April 14, 2018తెలుగు తెరకి నిండుదనం ... నవరస నటనతో పండుగదనం తీసుకొచ్చిన కథానాయిక సావిత్రి. విశాలమైన కళ్లతో ఆమె చేసిన హావభావ విన్యాసానికి అభిమానులు ఎందరో. అలాంటి సావిత్రి జీవితంలో ఎన్నో ఆనందాలు .. మరెన్నో విషాదాలు వున్నాయి. ఆమె జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించింది.
సావిత్రి లుక్ లో కీర్తి సురేశ్ ఎలా వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఒక్కసారిగా చూస్తే నిజంగానే ఇది సావిత్రి ఫోటోనే అనుకునేట్టుగా ఈ ఫస్టులుక్ వుంది. సావిత్రి లుక్ తో కీర్తి సురేశ్ ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్