అరబ్ మహిళతో అక్రమ సంబంధం: వ్యక్తికి 3 నెలల జైలు
- April 16, 2018అజ్మన్ క్రిమినల్ కోర్టు 23 ఏళ్ళ వయసున్న ఆసియా వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత అతన్ని డిపోర్టేషన్ కూడా చేస్తారు. 39 ఏళ్ళ అరబ్ మహిళతో అక్రమ సంబంధం కలిగి వుండడమే ఆసియా వ్యక్తి చేసిన నేరం. కేసు వివరాల్లోకి వెళితే, అరబ్ మహిళతో మసాజ్ కోసం 200 దిర్హామ్‌లకు ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు, ఆమె వద్దకు వెళ్ళాడు. అయితే ఆమె తనతో సెక్స్ చేయాల్సిందిగా అతన్ని కోరింది. సెక్స్ అనంతరం, తనకు మసాజ్ చేయాల్సిందిగా నిందితుడు కోరగా, ఆమె నిరాకరించింది. దాంతో డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు నిందితుడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం జరిగింది. అనంతరం నిందితుడు, ఆమె మొబైల్ ఫోన్‌ని తీసుకుని వెళ్ళిపోయాడు. అజ్మన్ పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలు తనపై నిందితుడు చేసిన ఆరోపణల్ని ఖండించింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్