ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!
- April 18, 2018బాహుబలి చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి పేరు ప్రపంచ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతోంది. బాహుబలి తరువాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడా అని అందరూ ఆతృతగా ఎదురు చూశారు. ఒకసారేమో ఎన్టీఆర్ తో సోలో సినిమా ఉంటుందని, మరోసారి అక్కినేని ఫ్యామిలీతో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. కొద్ది రోజుల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడు.రాజమౌళి ఈ నిర్ణయంతో అటు ఎన్టీఆర్ ఇటు రాంచరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అత్యంత భారీ అంచనాల మధ్య ప్రారంభమయ్యే ఈ చిత్రానికి బడ్జెట్ కూడా చర్చనీయాంశమే. ఈ సినిమా నిర్మాణానికి సుమారు 100, 150 కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో వార్త హల్చల్ చేస్తోంది. ఇదే విషయాన్నీ చిత్ర నిర్మాత దానయ్య కూడా దృవీకరించినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక