ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన

ఫిలిం ఛాంబర్ దగ్గర ఉద్రిక్తత..పవన్ నిరసన

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు చేరుకున్నారు. తనపై వస్తున్న అభియోగాల ఫై ఫిలిం ఛాంబర్ ఏమి చేస్తుంది..అసలు మెగా ఫ్యామిలీ హీరోలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానిపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్లు తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్ , నాగ బాబు ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో కూర్చున్నారు. అలాగే మిగతా మెగా హీరోలతో పాటు అల్లు అరవింద్ కూడా ఛాంబర్ కు వస్తున్నట్లు సమాచారం. తనపై జరుగుతున్న కుట్ర కు పవన్ ఫిలిం ఛాంబర్ దగ్గర నిరసన తెలుపబోతున్నాడని , అందుకే నల్ల దుస్తులతో పవన్ వచ్చారని అంటున్నారు. ఇక పవన్ అక్కడికి చేరుకున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఛాంబర్ కు వస్తుండడంతో అక్కడ చాల ఉద్రిక్తత నెలకొని ఉంది. మరికొద్ది సేపట్లో మీడియా తో పవన్ మాట్లాడే అవకాశం ఉంది.