మాట్లాతుంటే నోరు వాసన వస్తోందా...?
- April 20, 2018
కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు సరిగా బ్రెష్ చేసుకోకపోవడం, చిగుళ్ల సమస్యలతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్ర పరచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్లు తెల్లగా ఉండి నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా వంటింట్లో ఉండే ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.
పళ్లను శుభ్రపరచుకోవడానికి ఉప్పును ఈక్రింది విధంగా వాడవచ్చు....
1. కొంచెం ఉప్పు తీసుకొని దానిలో నీరు పోసి పేస్టులా చేసుకొని, బ్రష్‌తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఉప్పు నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపుతుంది. చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది.
2. రోజూ ఉదయం పళ్లు శుభ్రపరచుకున్న తర్వాత గోరువెచ్చని నోటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆతర్వాత తిరిగి నోటిని మంచి నీటితో శుభ్రపరచాలి. ఈవిధంగా రోజు చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
3. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు కలిపి దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి పేస్టులా చేసి దాంతో చిగుళ్లను రుద్దితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా మనం వాడుకునే పేస్టుపై కొంచెం ఉప్పు వేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. నిమ్మతొక్కలను పొడి చేసి దాంట్లో ఉప్పు కలిపి ఒక సీసాలో పోసుకొని రోజూ కొంచెం పొడి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి పళ్లు తోముకుంటే అందంగా మెరుస్తూ ఉంటాయి.
5. బ్రెడ్‌ను కాల్చి పొడి చేసి దాంట్లో తేనె కొంచెం ఉప్పు కలిపి పళ్లను రుద్దితే పళ్లపై గార పోతుంది.
6. నోటి దుర్వాసనతో బాధ పడేవారు ఉప్పు, బేకింగ్ సోడా సమపాళ్లల్లో కలిపి పళ్లపొడిలా తయారుచేసుకొని రోజు పళ్లు తోముకుంటుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







