ఇండియా:మైనర్లను అత్యాచారం చేస్తే ఉరే.. మారబోతోన్న చట్టం...
- April 20, 2018
మైనర్లపై అత్యాచారానికి పాల్పడే కామాంధులకు మరణశిక్ష విధించేలా చట్టం మారబోతోంది. దీనికి సంబంధించిన కీలక ఆర్డినెన్స్‌ను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఇవాళ అత్యవసరంగా సమావేశంపై దీనిపై చర్చించనుంది.
దేశంలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతుండడంతో.. పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం.. పోక్సో చట్టానికి మార్పులు తేనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన వారికి గరిష్టంగా జీవితఖైదు మాత్రమే పడుతోంది. అయితే.. కథువా.. ఉన్నావ్.. ఘటన నేపథ్యంలో బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీనికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ కూడా మద్దతు పలికారు. దీంతో.. కేంద్రం కూడా కామాంధులను ఉరి తీయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చట్టంలో తక్షణం మార్పు తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేసి, వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లుగా దీన్ని పార్లమెంట్ ముందుకు తేనున్నారు.
పోక్సో చట్టానికి మార్పులు తెస్తున్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓ బాలికపై అత్యాచారం కేసులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ముందు అదనపు సొలిసిటర్ జనరల్.. పిఎస్ నర్సింహ ఈ విషయాన్ని వెల్లడించారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులను నిరోధించడానికి చట్టాన్ని కఠినతరం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం