కిమ్ సంచలన నిర్ణయం...

కిమ్ సంచలన నిర్ణయం...

గతేడాది వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను హడలెత్తించిన ఉత్తరకొరియా అణు పరీక్షలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, దక్షిణకొరియాలతో చర్చల అనంతరం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దక్షిణకొరియా వింటర్‌ ఒలింపిక్స్‌ నుంచి కిమ్ దూకుడు తగ్గిస్తూ వచ్చారు. దక్షిణ కొరియా అధికారుల బృందం ప్యాంగ్‌యాంగ్‌ వేదికగా కిమ్‌ను కలుసుకోగా అణు పరీక్షల నిలిపివేతకు సంసిద్ధతను కిమ్‌ వ్యక్తం చేసారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్షం వ్యక్తం చేసారు.

Back to Top