Hero Sai Kumar is going to contest in Karnataka Elections
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
కర్ణాటక ఎమ్మెల్యే ఎన్నికల్లో సాయికుమార్ పోటీ...

కర్ణాటక ఎమ్మెల్యే ఎన్నికల్లో సాయికుమార్ పోటీ...

బెంగళూరు: బహుబాష నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ టిక్కెట్ నుంచి సాయికుమార్ పోటీ చేస్తున్నారు.


2008లో పోటీ
2008 శాసన సభ ఎన్నికల్లో సాయికుమార్ బాగేపల్లి శాసన సభ నియోజక వర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2008లో బాగేపల్లిలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసిన ఎన్. సంపంగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


నాలుగో స్థానం
2008లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బాగేపల్లి నుంచి పోటీ చేసిన సంపంగికి (కాంగ్రెస్) 32,244 ఓట్లు, శ్రీరామరెడ్డికి (కమ్యూనిస్టు) 31,306 ఓట్లు, నాగరాజ రెడ్డికి (జేడీఎస్) 27,926 ఓట్లు, సాయికుమార్ కు (బీజేపీ) 26,070 ఓట్లు వచ్చాయి. 2008 ఎన్నికల్లో పోటీ చేసిన సాయికుమార్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.


స్వతంత్ర అభ్యర్థి
2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బాగేపల్లి నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుబ్బారెడ్డి 65,187 ఓట్లతో ఘన విజయం సాధించారు. సీపీఐ (ఎం) నుంచి పోటీ చేసిన శ్రీరామరెడ్డికి 35,263 ఓట్లు, జేడీఎస్ నుంచి పోటీ చేసిన హరిదాస్ రెడ్డికి 16,539 ఓట్లు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సంపంగికి 15,431 ఓట్లు వచ్చాయి.


సెంటిమెంట్
సాయికుమార్ కన్నడ చిత్రరంగంలో ప్రముఖ హీరోగా ఉన్న సమయంలోనే బాగేపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మరోసారి పోటీ చెయ్యడానికి సిద్దం అయిన సాయికుమార్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారో ? లేదో అనే విషయం ఏప్రిల్ 15వ తేదీ వరకు ఎదురుచూడాలి.

తెలుగు ప్రజలు

బాగేపల్లి కర్ణాటకలో ఉన్నా ఆ నియోజక వర్గం ప్రజలు మాట్లాడే బాష తెలుగు. తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్న బాగేపల్లిలో నటుడు సాయికుమార్ ఎంత వరకు స్థానిక ప్రజలను ఆకట్టుకుంటారో వేచిచూడాలి. గత ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయిన సుబ్బారెడ్డి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేస్తున్నారు.