కోట్లు సంపాదించిన లెక్కల టీచర్ ఎలాగంటే...
- April 21, 2018
చాలామందికి లెక్కల సబ్జెక్ట్ అంటే భయం. ఒక లెక్క చేయాలంటే బోలెడన్ని డౌట్లు. ఆ సూత్రాలు.. అవేనండి ఫార్ములాలు గుర్తుండవంటారు. కానీ సరైన లెక్కల టీచరైతే.. అరటిపండు వలిచిపెట్టినట్టుగా లెక్కలు చెబుతారు. స్టెప్ బై స్టెప్ వేస్తూ.. సింపుల్ గా గుర్తిండిపోయేలా మ్యాథ్స్ ని చెప్పడంలో కొందరు టీచర్లు దిట్ట. అలాంటివారికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్. మన పక్కనున్న చైనాలో అలాంటి లెక్కలు టీచరు ఒకరున్నారు. ఆయన పేరు 'లి యచో'. ఆయన పిల్లలకు లెక్కలు చెప్పే కోట్లు సంపాదించాడు. మన దేశంలోనే కాదు.. చైనాలో కూడా ట్యూషన్లంటే పెద్ద బిజినెస్. అందుకే అక్కడి టీఏఎల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఆ సంస్థకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'లి యచో'.
చైనాలో పిల్లలకు స్కూళ్లలో బాగానే చెప్పినా.. మళ్లీ ట్యూషన్లకు వెళతారు. డ్రాగన్ కంట్రీలో తల్లిదండ్రులకు ట్యూషన్లంటే అంత ఇష్టం.. నమ్మకం. చైనాలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఏడాదికి దాదాపుగా 28 లక్షలు ఖర్చు చేస్తారు. అంటే నెలకు రెండు లక్షల రూపాయిలకు పైగా చదువుల కోసమే కేటాయిస్తారు. ఇందులో 90 శాతానికి పైగా డబ్బును ట్యూషన్ల ఫీజులు చెల్లించడానికే ఉపయోగిస్తారు. దీనిని బట్టి చూస్తే.. స్కూళ్ల కోసం కేవలం 10 శాతం డబ్బులే ఖర్చుపెడతారు. అందుకే అక్కడ ట్యూషన్ సెంటర్ల బిజినెస్ అంటే బంగారు గుడ్లు పెట్టే బాతులే. దీనివల్లే 'లి యచో' బిలియనీర్ అవ్వగలిగారు.
టీఏఎల్ సంస్థలో యచో కన్నా ముందే మరొకరు బిలియనీర్ అయ్యారు. గత ఏడాది కాలంలో ఈ సంస్థ స్టాక్స్ విలువ కూడా పెరగడంతో డబుల్ అయ్యింది. అంటే వీళ్లు చెప్పే ట్యూషన్లకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టీఏఎల్ సంస్థలో మొట్టమొదటి మ్యాథ్స్ టీచర్ లి యచోనే. ఈయన 2016 నుంచి ఈ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నారు. 2011 నుంచి ఈ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ కూడా. 2008 నుంచి 2011 మధ్యలో ఈ సంస్థ అందించే ఆన్ లైన్ కోర్సుల విభాగానికి ఇన్ ఛార్జ్ గా వర్క్ చేశారు. మొత్తానికి లెక్కలు చెబుతూనే కోట్ల రూపాయిలు సంపాదించారు. లెక్కల సబ్జెక్టా? మజాకా?
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







