దోమల అదుపునకు

దోమల అదుపునకు

వాషింగ్టన్‌: సాంకేతిక పరిజ్ఞానంతో మగ దోమలకు వంధ్యత్వం కల్గించి తద్వారా దోమల వ్యాప్తిని, వాటి వల్ల వస్తున్న వ్యాధులను నియంత్రించవచ్చని రుజువైంది. వివిధ వ్యాధులను వ్యాప్తి చేస్తున్న దోమలను నియంత్రించేందుకు వీలుగా దోమలను వాతారణంలోకి వదిలే ప్రక్రియను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) విజయవంతంగా పరీక్షించింది. డ్రోన్‌ సహాయంతో ఆ దోమలను వాతావరణంలోకి అణు సాంకేతికతను వినియోగిస్తూ ప్రవేశపెడితే జికా, తదితర వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎఇఎ, యుఎనఒలోని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ), వురు రోబోటిక్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ గతేడాది వంధ్య క్రిమి సాంకేతికత ఆధారిత దోమలను వదిలే విధానానికి రూపకల్పన చేశాయి. దీన్ని గత నెల బ్రెజిల్‌లో విజయవంతంగా పరీక్షించారు. డ్రోన్లలో ఉంచే మగ దోమలకు రేడియేషన్‌తో పునరుత్పత్తి సామర్థ్యాన్ని దూరంచేసి వాతావరణంలోకి విడిచిపెడతారు. అనంతరం ఈ దోమలు ఆడ దోమలతో కలిసినప్పటికీ సంతానం కలగదు. దోమలు వ్యాప్తి చెందవంటున్నారు.

 

Back to Top