అమెరికా లో మెగాస్టార్ చిరంజీవి సంబరాలు..
- April 28, 2018మెగా స్టార్ చిరంజీవి గతం లో ఎన్నడూ లేని విధంగా ఆనందంగా ఉన్నాడు. దీనికి కారణం తన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటిసారి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం. సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వచ్చిన రంగస్థలం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు చరణ్ లోని సరికొత్త నటుడిని బయటకు తీసింది. ఇంతవరకు చరణ్ లో చూడని నటనను ఈ మూవీ లో చేసే సరికి అందరు చరణ్ కు ఫిదా అయ్యారు. దీంతో మెగాస్టార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అమెరికా లో నిర్వహిస్తున్న మా వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యం లో అమెరికాకు చేరుకున్న మెగా స్టార్ కు మెగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మూడు గంటలకు రెగల్ మేకార్తుర్ ఇర్వింగ్ TX లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..