అమెరికా లో భారతి సంతతి వ్యక్తి జైలు పాలు
- April 28, 2018
హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డులు ఇప్పుడు డాలర్ కలలు కంటున్న భారతీయులకు అందని ద్రాక్షాలా మారుతున్నాయి. ఈ క్రమంలో వీసా రావాలని బలంగా కోరుకునే వ్యక్తులను టార్గెట్ చేసి, హెచ్-1బీ వీసా ఇప్పిస్తానంటూ భారీ మోసాలకు పాల్పడుతున్నాడు ఓ భారతి సంతతి వ్యక్తి. హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డులను ఇప్పటిస్తానంటూ వారి నుంచి అక్రమంగా 450,000 డాలర్ల ఫీజులను వసూలు చేశాడు. అతని మోసాలు వెలుగులోకి రావడంతో అమెరికా అతనికి జైలు శిక్ష విధించింది.
రమేష్ వెంకట పోతూరు విర్గో ఇంక్, సింగ్ సొల్యూషన్స్ ఆపరేటర్, మాజీ ఓవనర్. వీసా మోసాలకు పాల్పడుతున్నందుకు గాను ఇతనికి ఏడాది ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తున్నామని అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటించింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్స్(ఐసీఈ) హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ ఇన్వెస్టిగేషన్స్ డాక్యుమెంట్(హెచ్‌ఎస్‌ఐ), బెనిఫిట్ ఫ్రాడ్ టాస్క్ ఫోర్స్(డీబీఎఫ్‌టీఎఫ్)లు సంయుక్తంగా జరిపిన విచారణలో రమేష్ అక్రమ వీసా జారీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వెలుగులోకి వచ్చింది.
రమేష్ ఇప్పటి వరకు జారీ చేసిన 100కు పైగా మోసపూరిత వీసాలు, ఎంప్లాయర్స్ ఇచ్చే గ్రీన్ కార్డుల కోసం భారత్‌కు చెందిన నాన్-ఇమ్మిగ్రెంట్ వర్కర్ల నుంచి ఫీజుల కింద అక్రమంగా 450,000 డాలర్లను వసూలు చేసినట్టు తేలింది. 2010 నుంచి 2013 వరకు పోతూరు రమేష్ ఈ కార్యకలాపాలకు పాల్పడ్డాడని, వందల కొద్దీ డాలర్ల ఫీజును వర్కర్ల నుంచి సేకరించినట్టు విచారణ పేర్కొంది. పోతూరు రమేష్ సేకరిస్తున్న ఈ ఫీజులను డైరెక్ట్‌గా తన వ్యక్తిగత ఖాతాల్లోకే మరలించుకునేవాడు. ఇలా రమేష్ జరిపిన ఈ అక్రమ వీసా జారీ, అతన్ని జైలు ఊచలు లెక్కపెట్టుకునేలా చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!