హమస్ పోస్ట్‌పై ఇజ్రాయిల్ క్షిపణుల దాడి
- April 28, 2018
ఇజ్రాయిల్ సైన్యం హమస్ పోస్ట్‌పై శుక్రవారం రాత్రి రెండు క్షిపణులను ప్రయోగించింది. పశ్చిమ గాజా నగరంలో జాలర్ల హార్బర్‌కు సమీపంలో గల హమస్ స్థావరంపై జరిగిన ఈ దాడిలో భవనం, రెండు సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇజ్రాయిల్ సైన్యం కూడా వెంటనే స్పందించలేదు. మార్చి 30వ తేది నుండి ఇజ్రాయిల్, పాలస్తీనియన్ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో గాజా నగరంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రతి రోజూ వేలాదిమంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్ వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొంటున్నారు. తూర్పు గాజాలో శుక్రవారం వందలాదిమంది పాలస్తీనియన్లు, ఇజ్రాయిల్ సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించగా, 800మందికి పైగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







